Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-అంబర్పేట
జాతీయస్థాయి కరాటే పోటీల్లో క్రీడాకారులు సత్తాచాటడం అభినందనీయం అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన 6వ జాతీయస్థాయి జైళ్ల శాఖ క్రీడా పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు కరాటేలో నాలుగు బంగారు పతకాలు సాధించారు. ఈసందర్భంగా కరాటే కోచ్లు డాక్టర్ జీఎస్ గోపాల్ రెడ్డికి రూ. 11 వేలు, వి. నర్సింగరావుకు రూ. 5 వేల రివార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అనంతరం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో క్రీడాకారులు మరింత పట్టుదలతో శిక్షణ పొంది బంగారు పతకాలు సాధించి తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని పెంపొందించాలని ఆయన కోరారు.