Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ హిందీ అడ్వైస్ బోర్డు మెంబర్ డాక్టర్ తలిశెట్టి సుధాకర్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాతలని కేంద్ర ప్రభుత్వ హిందీ అడ్వైస్ బోర్డు మెంబర్, అంతర్జాతీయ పర్యావరణవేత్త, ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ తలిశెట్టి సుధాకర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రయివేట్ రికగ్నైజ్ స్కూల్స్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గురుబ్రహ్మ అవార్డుల ప్రదాన మహోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులను గౌరవించుకోవడమంటే సమాజంలోని సర్వజన సకల రంగాలను గౌరవించినట్లేనని, వారి త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. అనంతరం ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ ఎన్ని పదవులు వచ్చినా ఎన్ని పాటలు రాసిన తాను ఉపాధ్యాయుడిగా జీవించిన కాలం మహోన్నతమైనదిగా భావిస్తున్నానని అన్నారు. సామాజిక తత్వవేత్త, ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షులు డాక్టర్ సి.హెచ్.భద్ర మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచ మానవాళి అత్యంత సంక్షోభ సమయంలో కొట్టమిట్టాడుతుందని, పర్యావరణ పరిరక్షణకే విశ్వమానులంతా ఏకం కావాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సాయి గిరి మాట్లాడుతూ కరోనా సంక్షోభ సమయంలో మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కార్యక్రమంలో జితేందర్, వందలాదిగా ఉపాధ్యాయులు పాల్గొని అవార్డులు పొందారు.