Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి రవి
- బీఎస్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు
నవతెలంగాణ-ఓయూ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించిన విద్యార్థులందరికీ ే విద్యార్థి బంధు ప్రకటించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి రవి ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తిచేశారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ 16వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి డాక్టర్ పిడమర్తి హాజరై బీఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న అనేకమంది విద్యార్థులు నిరుద్యోగులుగా, వికలాంగులుగా మారారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఎంతైనా ఉందని అన్నారు. ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన విద్యార్థులందరికీ విద్యార్థి బంధు పథకం ద్వారా రూ.10 లక్షలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరారు. బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకట్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యమతంతో పనిచేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో బీఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు మంగళపల్లి ప్రవీణ్, ఎడవల్లి గోపి, వెంపటి సుందర్, జిల్లపల్లి నాగేశ్వరరావు, మొగిలిగిద్ద ప్రసాద్, చెవుల కిషన్, కొప్పు శ్రీశైలం, బాలస్వామి, ప్రసాద్, నగేష్, ఓయూ అధ్యక్షులు బోరెల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.