Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం
- గిరిజన విద్యార్థి సంఘం
- లంబాడీ హక్కుల పోరాట సమితి
నవతెలంగాణ-బంజారాహిల్స్
అక్టోబర్ 2లోగా 10% రిజర్వేషన్ అమలుచేయాలని, లేకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని గిరిజన విద్యార్థి సంఘం లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బంజారా హెచ్చరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 17న ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన బంజార ఆదివాసీ ప్రజల ఆత్మీయుల సమ్మేళనంలో గిరిజనుల రిజర్వేషన్ 6% నుంచి 10శాతానికి పెంచుతూ వారం రోజుల్లో జీఓ జారీచేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలయ్యాయరని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజన రిజర్వేషన్ 10% పెంచుతూ అక్టోబరు 2వ తేదీలోగా జీఓ జారీ చేయాలని డిమండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా లంబాడీ, ఆదివాసీ గిరిజన సంఘాలతో అక్టోబరు 3న ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో దరావత్ గణేష్ నాయక్, కేతావత్ జైపాల్ నాయక్, శీను నాయక్, రోహిత్, భరత్ తదితరులు పాల్గొన్నారు.