Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహుజన విద్యార్థి సంఘాల నాయకులు
- సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వినతి
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని బీఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ వేల్పుల సంజయ్ కోరారు. బుధవారం బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఓయూ జాక్ చైర్మెన్ కొత్తపల్లి తిరుపతి, అంబేద్కర్, పులింగంటి వేణుగోపాల్, రమేష్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, అంజి పాల్గొన్నారు.