Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హృద్రోగంతో బాధపడుతున్న చిన్నారుల శస్త్రచికిత్సకు చేయూతనివ్వండి
- ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో హార్ట్ 2 హార్ట్ వాక్స్ ప్రారంభం
నవతెలంగాణ-బంజారాహిల్స్
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో 'హార్ట్ 2 హార్ట్ వాక్స్' ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడంతోపాటు ప్రజల్లో గుండె ఆరోగ్యం కోసం నడకపై అవగాహన కల్పించడం తమ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 2021లో జరిగిన మొదటి ఎడిషన్లో చిన్నారుల శస్త్రచికిత్స కోసం దేశవ్యాప్తంగా 2.26 మిలియన్ రూపాయలను ఆస్టర్డియం హెల్త్ కేర్ గ్రూపు వారు ఫండ్ సేకరించారని చెప్పారు. బుధవారం కృష్ణకాంత్ పార్క్ వద్ద కృష్ణకాంత్ పార్క్ వాకర్స్ ఆసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, హెడ్, ఆస్టర్ వాలంటీర్స్ సుధీర్ బాసురి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సుధీర్ బాసురి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు heart2heart.astervolunteers.com వెబ్సైట్లో తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న వారు నడచిన ప్రతి 10వేల అడుగులకు 100 రూపాయలను ఈ చిన్నారుల గుండె శస్త్ర చికిత్సల కోసం ఏర్పాటు చేసిన నిధికి జమచేస్తామని వివరించారు. 16 అక్టోబర్ వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ఎక్కువ అడుగులు నడిచిన వారికి అవార్డులు అందజేస్తామని చెప్పారు.