Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ - మీర్పేట్
తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి, సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి పాఠశాలలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 4 లక్షల 50వేల చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, మేనేజర్ వెంకట్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ గజ్జెల రామచందర్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు, టీిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.