Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో పలు అంశాలకు ఆమోదం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్లో రోడ్ల అభివృద్ధి, చెరువుల సుందరీకరణ, పలు ఇతర అంశాలను స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. బుధవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో స్టాం డింగ్ కమిటీ సభ్యులు పన్నాల దేవేందర్‌రెడ్డి, మహ్మద్ అబ్దుల్ సలాం షాహిద్, మహపర, మిర్జా ముస్తఫాబేగ్, పర్వీన్ సుల్తానా, మండగిరి స్వామి, బాత జబీన్, విజరుకుమార్ గౌడ్, సీఎన్.రెడ్డి, మందడి శ్రీనివాసరావు, సామల హేమ, కమిషనర్ డీఎస్. లోకేష్‌కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్‌కంపాటి, ఈఎన్సీ జియాఉద్దీన్, చీఫ్ ఇంజినీర్(ప్రాజెక్ట్) దేవానంద్, అడిషనల్ కమిషనర్లు శృతి ఓజా, బి.సంతోష్, విజయలక్ష్మి, జయరాజ్ కెన్నడి, చీఫ్ ఎంటమాలజీ డా.రాంబాబు, అడిషనల్ సీసీపీి శ్రీనివాస్, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, జోనల్ కమిషనర్లు శంకరయ్య, మమత, పంకజ, శ్రీనివాస్‌రెడ్డి, సామ్రాట్అశోక్, ఎస్ఎన్డీపీ చీఫ్ ఇంజినీర్ వసంత, సెక్రటరీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆమోదించిన అంశాలు
1.జీహెచ్ఎంసీ ఎలక్షన్ బ్రాంచ్‌లో ఎస్ఈసీ కన్సల్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సీహెచ్.రవీంద్రనాథ్(రిటైర్డ్ జాయింట్ సెక్రెటరీ) సేవలను జులై 2022 నుంచి 30 జూన్ 2023 వరకు పొడిగిస్తూ రెమ్యూనరేషన్‌ను నెలకు రూ.55వేలు, రూ.34వేలు కన్వీనియన్స్ అలవెన్సులు చెల్లించుటకు ఆమోదం.
2.శేరిలిగంపల్లి జోన్ ఈపీటీఆర్ఐ చెరువు సుందరీకరణ చేయుటకు, హెర్బల్ పార్క్ అభివృద్ధి కోసం వర్టికల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్‌కు సీఎస్ఆర్ కింద ఏడాదిపాటు నిర్వహణకు జోనల్ కమిషనర్ ఎంవోయూ చేసుకోవడానికి అనుమతి.
3.శేర్లింగంపల్లి జోన్లో జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ వయా నల్లగండ్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి నుంచి బీహెచ్ఈఎల్ జంక్షన్ వరకు ప్రతిపాదిత 150 మీటర్ల వెడల్పు రోడ్డు, గుల్మొహర్ పార్క్ వద్ద జంక్షన్ల అభివృద్ధి చేసేందుకు సీఎస్ఆర్ కింద లీగల గ్రూప్‌కు జోనల్ కమిషనర్ అనుమతికి కమిటీ ఆమోదం.
4.శేర్లింగంపల్లి జోన్లో బయోడైవర్సిటీ ఒకటి, రెండు లెవెల్స్ ఫ్లైఓవర్ల కింద సెంట్రల్ మీడియం ట్రాఫిక్ ఐలాండ్ మూడేండ్ల నిర్వహణకు సీఎస్ఆర్ కింద యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్‌కు పరిపాలన, అనుమతికి కమిటీ ఆమోదం.
5.సికింద్రాబాద్ జోన్లో ఆర్డీపీ కింద మల్లాపూర్ జంక్షన్ నుంచి శివ హౌటల్ వరకు ప్రతిపాదిత 60 మీటర్ల రోడ్డు వెడల్పు చేయడానికి 78 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం.
6.నల్లగండ్ల గ్రామంలో 400/ఏఏ1/1 సర్వే నెంబర్లో గల శివరాజుకు చెందిన ఓపెన్ ప్లేస్‌లో గల 2,155.99 మీటర్లు గల హుడా ఆమోదించిన భూమిని వనజ హౌసింగ్ ఎల్ఎల్సీపీకి బది లీ చేయుటకు ప్రభుత్వ అనుమతి కోసం పంపడానికి ఆమోదం.
7.హుస్సేన్‌సాగర్ నాలాపై అరవింద్‌నగర్ వద్ద నిర్మించిన నాలాపై స్లాబ్‌ను తొలగించి రూ.2.99 కోట్లతో బ్రిడ్జి పున: నిర్మాణం కోసం పరిపాలన మంజూరుకు కమిటీ ఆమోదం.