Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్
- కలెక్టర్‌తో కలిసి గాంధీ హాస్పిటల్ సందర్శన
నవతెలంగాణ-సికింద్రాబాద్
అక్టోబర్ 2వ తేదీన సీఎం కేసీఆర్ గాంధీ హాస్పిటల్ ఎదుట ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం గాంధీ హాస్పిటల్ ఎదుట ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న పనుల ను, బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. మంత్రుల వెంట ఎంఏయూడీ ప్రిన్స్‌పల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, డీఎంఈ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అమోరు కుమార్, హాస్పిటల్ సూపరిండెంట్ రాజారావు ఉన్నారు. ఈ సంద ర్భంగా మంత్రులు మాట్లాడుతూ గాంధీ జయంతి సంద ర్భంగా 2వ తేదీన ముందుగా ఎంజీ రోడ్డులో గల గాంధీ విగ్రహం వద్ద సీఎం నివాళులు అర్పిస్తారనీ, అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ వద్దకు చేరుకుని హాస్పిటల్ ఎదుట హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16 పీట్ల మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారని చెప్పారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ అనేక దేశాలకు స్పూర్తిగా, ఆదర్శంగా నిలిచారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అలాంటి గాంధీని వదిలి గాడ్సేని కొలుస్తున్న దౌర్బాగ్యపు వ్యవస్థను చూస్తున్నామన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా రాష్ట్రంలోని పలు థియేటర్లలో మహాత్మాగాంధీ జీవిత చరిత్రను తెలియజెప్పే సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తే లక్షల మంది వీక్షించారని తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన గాంధీ హాస్పిటల్ వద్ద 16 ఫీట్ల గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తుండటం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. అహింసా మార్గం లో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ అనేకమందికి స్పూర్తిగా నిలిచారని అన్నారు. నెల్సన్ మండేలా లాంటి వారు గాంధీ చూపిన అహింసా మార్గా న్ని అవలంభిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ సైతం 14 ఏండ్లు అహింసా మార్గంలో రాష్ట్ర సాధన ఉద్యమం చేపట్టి తెలంగాణను సాధించారని తెలిపారు. కోవిడ్ సమయంలో అత్యద్భుత సేవలు అందించిన హాస్పిటల్‌గా గాంధీకి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. మంత్రుల వెంట జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, నార్త్ జోన్ డీసీపీ చందనాదీప్తి, ట్రాఫిక్ డీసీపీ యోగేష్ గౌతమ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ వసంత, అర్అండ్ ది ఎస్ఈ హఫీజుద్దిన్, ఐఅండ్పీఅర్ సీఈవో రాధాకృష్ణ, హెచ్ఎండీఏ ఎస్ఈ పరంజ్యోతి, తదితరులు ఉన్నారు.