Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘట్ కేసర్లో 24వ ఆవిర్భావ వేడుకలు
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ మండల కేంద్రంలో కేవీపీఎస్ జెండాను ఆ సంఘం మండల కార్యదర్శి మిరియాల సాయిచందర్ ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1998 అక్టోబర్ 2న కులవివక్ష వ్యతిరేక పొరాట సంఘం ఆత్మగౌరవం సమానత్వం, కుల నిర్మూలన అనే లక్ష్యాల సాధన కోసం ఒక చారిత్రక అవసరంగా ఏర్పడిందన్నారు. 23 ఏళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం. శ్మశాన స్థలాల కోసం 12 35 జీవో, దళితులకు 101 యూనిట్ల వరకు ఉచిత కరెంటు జీవో 342, కులాంతర వివాహితుల ప్రోత్సాహం 2.50లక్షల రూపాయలు పెంపు కోసం జీవో నెంబర్ 12, వాటితో పాటు సంక్షేమ హాస్టల్ విద్యార్థుల నెలసరి ప్రాథమిక సమస్యల పరిష్కారం కోసం ఐదు వేల రూపాయలు వచ్చే విధంగా పోరాడి సాధించడం జరిగింది. కరోనా కష్ట కాలంలో కేవీపీిఎస్ తమ వంతు బాధ్యతగా సుమారు 20 లక్షల రూపాయలు విలువైన సేవా కార్యక్రమాలు చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహనీయుల జయంతులు వర్ధంతులు, ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు. మెడికల్ క్యాంపులు, శ్రమదానాలు నిర్వహించింది. కులాంతర వివాహాలు ప్రోత్సహిస్తూ అనేక ఆదర్శ వివాహాలు జరిపింది. కుల దురహంకార హత్యలపై దళితులపై దాడులు దౌర్జన్యాల ప్రతి సంఘటనపై కెేవీపీిఎస్ ఉద్యమించింది. తక్షణం జరిగే పోరాటాలు ఢిల్లీ తరహాలో దళితులకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని, సాంఘిక సంక్షేమ హస్టళ్లల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని, దళిత బంధు ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని, దశల వారి ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. సామాజిక న్యాయం మరియు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కేవీపీిఎస్ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో, కేవీపీిఎస్ సీనియర్ నాయకులు కర్రె జంగయ్య , మండల ఉపాధ్యక్షురాలు, మహేశ్వరి, కె.సాయి కిరణ్, కె.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.