Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనసమూహాలే లక్ష్యంగా దాడికి యత్నం
- నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు స్వాధీనం
- ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో పాక్ ఐఎస్ఐ సహకారంతో ఉగ్రదాడికి కుట్ర చేశారు. అయితే ముందస్తు సమాచారంతో కుట్రను పోలీసులు భగం చేశారు. కుట్రకు పాల్పడ్డ అబ్దుల్ జాహెద్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. జనసమూహాలు, సభలపై గ్రెనేడ్లు విసిరేందుకు కుట్ర పన్నారన్న సమాచారం తో పోలీసులు వారిని అరెస్టు చేసి, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు, రూ.5.41లక్షలు, మొబైల్‌ఫోన్స్, బైక్ స్వాధీనం చేసుకు న్నారు. జాహెద్‌తో పాటు సమీయుద్దీన్, హసన్ ఫరూక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమీయుద్దీన్ సైదాబాద్, మాజ్ హసన్ ఫరూక్ మెహదీపట్నం, అబ్దుల్ జాహెద్ మలక్‌పేటకు చెందినవారిగా పోలీసులు గుర్తిం చారు. జాహెద్‌పై గతంలో ఉగ్ర కార్యకలాపాల కేసులు న్నాయి. పాక్ ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధాలున్నాయన్న సమాచారంతో పోలీసులు అరెస్టు చేశారు. గ్రెనేడ్లు విసిరి భయాందోళనలు, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు పథకం పన్నినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు.
పలు పేలుళ్లలో జాహెద్
జాహెద్ హైదరాబాద్‌లో పలుదాడులు నిర్వహించాడు. 2005లో బేగంపేట్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో పర్హతుల్లా ఘోరి, సిద్ధిక్బీన్ఉస్మాన్, అబ్దుల్మాజీద్ పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురు ఐఎస్ఐలో పనిచేస్తున్నారు. 2002లో దిల్సుఖ్ నగర్ సాయిబాబు టెంపుల్ బాంబుదాడి చేశాడు. ముంబ యిలో ఓ బస్సును పేల్చేశాడు. 2004లో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ దగ్గర బాంబులు పేల్చాడు. అయితే జాహెద్ ఐఎస్ఐ ప్రోధ్బలంతో నగరంలోని యువతకు ఉగ్ర శిక్షణతో పాటు ఆర్థిక సాయం కూడ చేస్తున్నాడని పోలీసులు గుర్తిం చారు. తాజాగా పాక్ ఐఎస్ఐతో సంప్రదింపులు జరుపు తున్నట్లు పోలీసులు గుర్తించారు. జాహెద్ వేర్వేరు పరిచ యాల ద్వారా సంప్రదింపులు జరిపి ఉగ్రదాడి కోసం మాజ్‌హసన్, సమీయుద్దీన్‌ను రిక్రూట్ చేసుకున్నాడు. నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి.. ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పాక్ ఉగ్రవాద హ్యాండ్లర్ల నుంచి గ్రెనేడ్లు తీసుకున్నట్లు పోలీసులు గుర్తిం చారు. గుంపులుగా ఉన్న జనంపై గ్రెనేడ్లతో దాడిచేయడమే వీరి లక్ష్యమని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. జాహెద్ దగ్గర రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, రూ.3.91లక్షల నగదు, రెండు ఫోన్లు, సమీయుద్దీన్ దగ్గర హ్యాండ్ గ్రెనేడ్, రూ.1.50లక్షల నగదు, బుల్లెట్ బండి, మొబైల్, మాజ్ హసన్ దగ్గర హ్యాండ్ గ్రెనేడ్, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.