Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగోల్
ఆపదలో ఉన్న సాటి మనిషిని చేరదీసి తనకు తోచిన సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకోవడంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా నిలువెత్తు నిదర్శనం. ఓవైపు రాజకీయాలలో మరోవైపు వైశ్య సామాజిక ఫెడరేషన్, ఉప్పల ఫౌండేషన్లలో చురుకైన పాత్రను పోషిస్తూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
సిద్దిపేట జిల్లా లక్ష్మీ దేవిపల్లి గ్రామానికి చెందిన ఉప్పల శ్రీనివాస్ గుప్త హైదరాబాద్ నగరంలోని నాగోల్ డివిజన్లో గల కోపరేటివ్ కాలనీలో స్థిరప డ్డారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై దృష్టి మళ్లిం దని, దీంతో 1993లో డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఎన్ఎస్యుఐ నాయకుడిగా పనిచేస్తూ కాంగ్రెస్లోకి, అక్కడి నుండి టీఆర్ఎస్లోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా రాష్ట్ర అభివృద్ధికి తనవంతుగా అహర్నిశలు కృషి చేస్తున్నారు. బాటిలింగ్ కంపెనీ వ్యాపారాన్ని కొనసా గిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటూ గత 25 సంవత్స రాలుగా తాను సంపాదించిన దానిలో కొంత సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు.
ఆలయ నిర్మాణాలకు సహాయసహకారాలు, అన్నదానాలు
నాగోల్ డివిజన్లోని బండ్లగూడ రామాలయం వద్ద ఏర్పాటుచేసే గణపతి వద్ద గడిచిన 16 ఏళ్లుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గణపతి, దుర్గా భవాని లాంటి శరన్నవరాత్రులకు వచ్చిన వారికి లేదనకుండా చందాలు అందజేశారు.
గాంధీ విగ్రహాల ఏర్పాటుకు ప్రోత్సహిస్తుంటారు ,గత పాతికేలా నుండి నిరుపేదలైన ఆడకూతురుల పెళ్లిళ్లకు బంగారు మాంగల్యం, వెండి మెట్టెలు, గాజులు, చీరలను అందజేస్తూ ఆదుకుంటున్నారు. ఇప్పటికే సుమారు 5000 మంది వధువులకు అందజేసినట్లు ఆయన తెలిపారు.
ఉప్పల ఫౌండేషన్ స్థాపించి .. ఫౌండేషన్ ద్వారా
20 ఏళ్ల క్రితం ఉప్పల ఫౌండేషన్ స్థాపించి ఫౌండేషన్ ద్వారా వికలాంగులకు చక్రాల కుర్చీలు, చేతి కర్రలు, అనాధ పిల్లలకు నిత్యవసరాలు, దుస్తువులు, చదువు కోసం కావలసిన ఫీజులు, నోటు పుస్తకాలు పంపిణీ చేసి ఆదుకుంటున్నామని ఆయన వివరిం చారు. కరోనాకాలంలో ఉప్పల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల మందికి దమ్ బిర్యాని వండి నగర పరిసరాలు ,మురికివాడలో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రోడ్లపై ఉండే యాచకులకు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఆ సమయంలోనే 15 రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు ఉండే 14వేల కిట్ల జూట్ బ్యాగులను అందించామని తెలిపారు. సొంత ఊరు లక్ష్మీదేవి పల్లెలో 600 గజాలలో ఉన్న తమ ఇంటిని కూల్చివేసి గ్రామానికి సామాజిక భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు తాను వైశ్యుడిని అయినా ఒక పేదరిక కుటుంబం నుంచి వచ్చానని, పేదరికంలో ఉన్న సాధక, బాధకాలు తెలుసు అని, అందుకోసం తనకు వచ్చిన దాంతో కొంత సహాయ సహకారాలు చేసి ఆదుకుంటే బాగుంటుందనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు.
సామాజిక సేవా కార్యక్రమాలు : అవార్డులు
మూడు పర్యాయాలుగా రైల్వే బోర్డు సభ్యునిగా, అనంతరం మధ్య విమోచన ప్రచార కమిటీ సభ్యునిగా ఉంటూ చిన్న వయసులో మద్యానికి బానిస కాకుండా అనేక కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు లను నిర్వహించినట్లు శ్రీనివాస గుప్తా తెలిపారు. వైశ్య విద్యార్థులకు ఐపీఎస్ ఐఏఎస్ చదువుతున్న వారికి లక్ష రూపాయల చొప్పున ఉచితంగా విరాళం ఇచ్చామని ఇప్పటికీ 22 మందికి సహాయం అందించామని అదేవిధంగా వైద్యం, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు మెరిట్ సంపాదించిన పేదవారికి ఏడాది పాటు ఫీజులను చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు, గల్వాన్ లోయలో అసువులు బాసిన కల్నల్ సంతోష్ కుమార్ కుటుంబానికి మొట్టమొదటిగా కలిసి లక్ష రూపాయల ఆర్థిక సహాయం, అదేవిధంగా కిన్నెర మొగల్య్యకు మొదట ఆర్థిక సాయం అందించి ఆదరించడం జరిగింది అన్నారు. ఢిల్లీలో అప్పటి సిక్కిం గవర్నర్ బి రామారావు చేతుల మీదుగా ''సేవా రత్న'' అవార్డును అందుకున్నట్లు తెలిపారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా మరోవైపు ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు జాతీయ కార్యదర్శిగా కొనసాగుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూనే 33 జిల్లాల్లోని ఆర్యవైశ్యులకు రాజకీయంగా ఏ అవసరం ఉన్నా ఉప్పల శ్రీనివాస గుప్తనే ముందుంటారు.
కుటుంబ నేపథ్యం : సహకారం
భార్య స్వప్న, కుమారులు సాయికిరణ్, సాయి తేజలు కూడా శ్రీనివాసగుప్త చేపడుతున్న సేవా, సహకారా లకు ప్రోత్సాన్నిస్తున్నారు.