Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్ నగర్
ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జవహర్నగర్ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, కార్యదర్శి, చిన్నం బాల నర్సింహ ఆధ్వర్యంలో హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లోని ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ వారికి వినతిపత్రం అందజేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తగినన్ని ఆటో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ఆటో మోటర్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ టీఆర్ఎస్కేవీ అనుబంధ సంస్థ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆటో డ్రైవర్లు ఎదుర్కుంటున్న కొన్ని ప్రధాన సమస్యలను వారి దృష్టికి తీసుకొస్తున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధి లోని షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్ద పార్కింగ్ స్థలాలు లేని కారణంగా ఆటో డ్రైవర్లు ప్రయాణికులను ఎక్కించుకునే, దించే సమ యంలో అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు ఫోటోలు తీసిన కారణంగా నెల వచ్చేసరికి రూ.వేలు చలాన్ల రూపంలో వస్తున్నాయని తెలిపారు. సమయానికి చెల్లించని ఆటోలను నడిరోడ్డుపై జప్తు చేసుకుని ఆర్టీఓ అధికారులకు అప్పజెప్పుతున్నారని తెలిపారు. నిరుపేదలైన ఆటో డ్రైవర్లు కోర్టు చుట్టూ తిరిగి రోజువారి ఉపాధి కోల్పోయి ఆర్ధికంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం తగినన్ని పర్కింగ్ స్థలాలను కేటాయించాలని కోరారు. జీహెచ్ఎంసీ పరిధిలో పరిమిట్లు లేకపోవడం వల్ల ఇతర జిల్లాల నుంచి ఆటోలను కొనుగోలు చేస్తుండటంతో జీహెచ్ఎంసీ పరిధిలో అర్హులైన డ్రైవర్లకు పరిమిట్లు ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఎల్ఏ, ఊబర్, రాపిడో ఆప్ సంస్థలు టూవీలర్ ఓన్ ప్లేట్ వాహ నాలకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తున్న ఈ సంస్థలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నిత్యావసర సరుకుల ధరలకు అనుగునంగా ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలనీ, ప్రభుత్వ అనుమతి లేని అధిక వడ్డీలు వసూలు చేస్తున్న ఆటో ఫైనాన్సర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ, సిటీ శివారు ప్రాంతాల్లో ఆటోలకు స్పెషల్ డ్రైవ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ పాండునాయక్, రాష్ట్ర కార్యదర్శి చిన్నం బాల నర్సింహా, ఎస్.రమేష్, శ్రావణ్ కుమార్, డి.శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సాయి, టి.కుమార్, తదితరులు పాల్గొన్నారు.