Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
యావత్ భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా జాతీయ నూతన పార్టీని ఏర్పాటు చేయబోతున్న సీఎం కేసీఆర్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మత్స్యకారుల సమన్వయ సంఘం ప్రకటించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు గుండ్లపల్లి శ్రీనివాస్, అల్లుడు జగన్, బల్ల సత్తయ్యలు మాట్లాడారు. అవిశ్రాంత పోరాటాల ద్వారా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఇక్కడి సంక్షేమ పథకాలు దేశ ప్రజలందరికీ అందాలనే లక్ష్యంతో జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. దేశ గతిని మార్చేందుకు సిద్ధపడ్డ కేసీఆర్ వెంటే తామంతా కలిసి నడుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్య కారుల సమన్వయ కమిటీ సభ్యులు గుండ్లపల్లి శ్రీను, బండ్ల సత్తయ్య, శీను ముదిరాజ్, అల్లుడు జగన్ పాల్గొన్నారు.