Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్ నగర్
మహిళా పారిశుధ్య కార్మికుల సేవలు అమోఘం అని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మోహన్ రావు కాలనిలో డిప్యూటీ మేయర్ కార్యాలయంలో మంగళవా రం దసరా పండగ సందర్భంగా మహిళా మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు డిప్యూటీ మేయర్ దంపతులు తమ సొంత డబ్బులతో బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ కరోనా సమయంలో అత్యంత అత్యవసర సేవల్లో మహిళా పారి శుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని గుర్తు చేశారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 28వ డివిజ న్లలో ప్రతి కాలనీలో చెత్తను ఊడ్చి స్వచ్ఛతను జవహర్ నగర్ ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. పరిశుభ్రతే పరమావధిగా భావిస్తూ పనులు కొనసాగిస్తున్నారన్నారు. పారిశుధ్య కార్మికులను గౌరవించాలని పేర్కొన్నారు.