Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సీఎం కేసీఆర్ స్థాపించబోయే నూతన పార్టీకి అన్ని వర్గాల, ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంద ని ఎమ్మెల్సీ రాజేశ్వరరావు అన్నారు. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏలో వార్షిక ప్రాంతీయ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. వైఎంసీఏ వ్యవస్థాపకులు సర్ జార్జ్ విలియమ్స్ 200వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్వీస్ స్టీవెన్ సన్తో కలిసి రాజేవ్వర్రావు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణాలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి దేశ ప్రజలు కేసీఆర్ పాలన కోరుతున్నారనీ, లక్షలాది మంది సభ్యులున్న వైఎంసీల మద్దతు కూడా కావాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే స్టీవెన్సన్ మాట్లాడుతూ సర్ జార్జ్ విలియమ్స్ లండన్లో యువత తప్పుడు మార్గంలో వెళ్లకుండా వారిని క్రీడలవైపు దృష్టి మరల్చేందుకు వైఎంసీఏను స్థాపించారని తెలిపారు. నేడు ప్రపంచ దేశాల్లో ఎంతో మంది క్రీడాకారులను వైఎంసీఏ అందించిందని కొనియాడారు. గ్రేటర్ హైదరా బాద్ వైఎంసీఏ చేస్తున్న కృషిని కూడా ఆయన అభినం దించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఏసీ హాలును ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, స్టీవెన్ సన్లు ప్రారంభించారు. వైఎంసీఏల చరిత్రను తెలియచెప్పే రూపొందించిన నూతన సావనీరు ఆవిష్కరించారు. వైఎంసీఏల్లో విజ్ఞాన, మేధావి వర్గాలు, ఉత్సాహవంతులైన వాళ్ళు ఉన్నారనీ, వారిని రాజకీయాల్లో ప్రోత్సహిస్తే తప్పక తమ మద్దతు ఉంటుందని వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు జయకర్ డేనియల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎంసీఏ రీజనల్ చైర్మెన్ రెనాల్డ్ విలియమ్స్, ప్రోగ్రామ్ సెక్రెటరీ కల్యాణ్ రాజ్, గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ ప్రధాన కార్యదర్శి లెనార్డ్ మైరిన్, ప్రతినిధులు డాక్టర్ సంపత్, కెన్నెత్, అజేత, ధన్రాజ్, తదితరులు పాల్గొన్నారు.