Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకటి దసరా, రెండోది జాతీయ పార్టీ ప్రకటన
- ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
నవతెలంగాణ-బంజారాహిల్స్
నేడు ఖైరతాబాద్ వాసులకు రెండు పండగలు అనీ, ఒకటి విజయదశమి, రెండోది సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేండర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని బంజారా భవన్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ అధ్యక్షతన జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్, వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నే కవిత గోవర్ధన్ రెడ్డి, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, కార్బన్ డెవలప్మెంట్ చైర్మెన్ విప్లవ కుమార్‌తో కార్యకర్తలతో చర్చ గోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ జాతీయ పార్టీలో కార్యకర్తలుగా పని చేయడానికి ప్రతి ఒక్కరూ తమకున్న అభిప్రాయాలను పక్కనపెట్టి మనస్పర్దలు లేకుండా క్రమశిక్షణ గల కార్యకర్తగా రేపటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మెన్ ప్రసన్నకుమారి, మాజీ కార్పొరేటర్ మామిడి నరసింహారావు, డివిజన్ అధ్యక్షులు రాముడు చౌహాన్, ఎస్కే హమ్మధ్, వట్టి చంద్రశేఖర్, మహేందర్ బాబు, అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.