Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ తర్వాతే మునుగోడు ఎన్నికలకు వెళ్లాలి
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ
నవతెలంగాణ-అడిక్మెట్
బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 54 శాతం రిజర్వేషన్ తక్షణమే ప్రకటించి మునుగోడు ఎన్నికలకు వెళ్లాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం విద్యానగర్ బీసీ భవన్లో బీసీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్ర సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ బీసీలకు అన్ని రంగాల్లో 54% రిజర్వేషన్ కల్పించి తర్వాతే మునుగోడు ఉప ఎన్నికకు వెళ్లాలని డిమాండ్ చేశారు. వందల ఏండ్లుగా దోపిడీ వలసకు గురవుతున్న తెలంగాణ రాష్ట్రం సొంత పార్టీ వేదిక కావాలని ప్రజా ఉద్యమం నుంచి వచ్చిన ఫలాన్ని కేసీఆర్ తన రాజకీయ స్వార్థానికి బలి చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని మరోసారి వలస దోపిడీ కోసం కేసీఆర్ తలుపులు తెరిచారని విమర్శించారు. సీబీఐ, ఈడీల నుంచి తప్పించుకోవడానికి తీవ్రమైన ప్రజా వ్యతిరేకత నుంచి దష్టి మరల్చడానికే తనకు అలవాటైన అక్రమ మార్గాలలో మునుగోడు ఉపఎన్నిక గెలవడానికి ఈ విన్యాసాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో బీసీ న్యాయవాదుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ యాదవ్, లక్ష్మయ్య, అనంతయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.