Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కప్పాటి పాండురంగారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
దసరా పండగను పురస్కరించుకుని భారతదేశ ప్రగతిని కాంక్షిస్తూ..తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందుతున్న సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటి పురపాలక, పరిశ్రల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును తెలంగాణ భవన్లో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైైర్మెన్ కప్పాటి పాండురంగా రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిరంతరం చేదోడుగా వుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రానికి కీలక అంతర్జాతీయ స్థాయి ఐటి సంస్థలు, పరిశ్రమలను తీసుకురావడానికి అదేవిధంగా పురపాలక సంస్థలకు అభివృద్ధిలోకి తీసుకువచ్చి జాతీయ అవార్డులను రావడానికి, పార్టీని విజయపథంలో నడిపించడంలో అహర్నిశలూ శ్రమిస్తున్న కేటీఆర్ యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.