Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
నవతెలంగాణ-ఓయూ
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో దాని నివారణకు 150 దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత భారతదేశానికి దక్కిందని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. ఐఐజీహెచ్ ఆధ్వర్యంలో నేతృత్వ సాధన 14వ ఎడిషన్ పొలిటికల్ లీడర్ షిప్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఓయూ దూర విద్యా కేంద్రం ఆడిటోరియంలో గురువారం జరిగింది. ఈకార్యక్రమానికి గవర్నర్ తమిళి సై హాజరై మాట్లాడుతూ కరోనా సమయంలో 150 దేశాలకు వ్యాక్సిన్ అందజేసిన ఘనత ఇండియాకే దక్కిందన్నారు. ప్రపంచంలోనే యంగెస్ట్ కంట్రీ ఇండియా అని అన్నారు. సీఎం అంటే కామన్ మ్యాన్, పీఎం అంటే పబ్లిక్ మ్యాన్ అని ఒక నినాదం ఇచ్చారు. ప్రజల దగ్గరికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవాడే నాయకుడని తెలియజేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ హైదరాబాద్ (ఐఐజీహెచ్) పాలసీ సంస్థ చేస్తున్న కార్యక్రమం చాలా గొప్పగా ఉందన్నారు. కార్యక్రమంలో ఐఐజీహెచ్ అధ్యక్షుడు మురళీ మనోహర్, ప్రధాన కార్యదర్శి డా.ఓ.శ్రీనివాస్ రెడ్డి, రవీంద్ర సాతే, జయంత్ కులకర్ణి, రవీందర్ రెడ్డి, డా.పి.శంకర్, డా.రామకృష్ణతో పాటుగా 12 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు, న్యాయవాదులు, సోషల్ వర్కర్స్, మేధావులు పాల్గొన్నారు.