Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
నవంబర్ 5,6వ తేదీన కొంపల్లిలోని ఆస్పీఎస్ కన్వెన్షన్ సెంటర్ వద్ద క్రెడారు ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు క్రెడారు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు పి రామకృష్ణారావు తెలిపారు. కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ఆధ్వర్యంలో గురువారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రాపర్టీ షో బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తర హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా క్రెడాయ్ ప్రాపర్టీ షో పనిచేస్తుందన్నారు. ప్రధానంగా మెదక్ జిల్లా జహీరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్ జిల్లాలవాసులు ఈ ప్రాంతాల్లో ఉండటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. 2014 నుంచి ప్రతి ఏటా 25 వేల నుంచి 35 వేల నివాసాలు కొనుగోలు కాగా ప్రస్తుతం 50 వేల పైచిలుకు చేరుకుందన్నారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రత్యేక నివాసాల ఏర్పాటే తమ లక్ష్యమని చెప్పారు. నవంబర్ 5,6వ తేదీన కొంపల్లిలోని ఆస్పీఎస్ కన్వెన్షన్ సెంటర్ వద్ద నిర్వహించనున్న ప్రాపర్టీ షోలో మొత్తం 44 స్టాళ్లు ఏర్పాటు చేశామని ప్రతినిధులు వివరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వి రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు జి ఆనంద్ రెడ్డి, కె. రాజేశ్వర్, ఎన్ జయదీప్ రెడ్డి, బి జగన్నాథరావు, కార్యదర్శి ఆదిత్య గౌర, ఉప కార్యదర్శిలు శివరాజ్ ఠాగూర్, కె రాంబాబు పాల్గొన్నారు.