Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
భారీ వర్షాలతో వచ్చే వరద నీటి ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని గాంధీనగర్ కార్పోరేటర్ పావని వినరు కుమార్ తెలిపారు. గురువారం అశోక్‌నగర్ నాలా పరివాహక ప్రాంతాల్లో ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రవీణ్, అసిస్టెంట్ ఇంజినీర్ అరుణతో కలిసి పర్యటించారు. వరద ప్రవాహం వల్ల నాలాకు అనుకొని ఉన్న ఇండ్లలో గోడలకు పగుళ్లు ఏర్పడి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. ఎక్కడైతే రిటర్నింగ్ వాల్ నిర్మాణం జరగలేదో, అక్కడ వెంటనే నిర్మాణాన్ని ప్రారంభించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నగర యువనాయకులు వినరు కుమార్, ఎం.ఉమేష్, సాయి కుమార్, ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్, బస్తీవాసులు సాయిలు, ఎల్లయ్య, భాగ్యమ్మ, ఉమా, వెంకటమ్మ పాల్గొన్నారు.