Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. గురువారం నాగారం పురపాలక సంఘం పరిధి 17వ వార్డ్‌లోని సత్యనారాయణ కాలనీలో రూ.4 లక్షలతో చేపట్టిన డ్రయినేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పాలకవర్గం నిరంతరం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మెన్ బండారి మల్లేశ్ యాదవ్, కౌన్సిలర్ అన్నంరాజు లావణ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.