Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. గురువారం మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం గ్రామంలోని మహాత్మా జ్యోతిరావు బాపూలే గురుకుల స్కూల్లో స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈకార్యక్రమానికి బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ హాజరై క్రీడాజ్యోతిని వెలిగించి ఆటలను ప్రారంభించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు సీఎం కేసీఆర్ తగిన సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. రేపటితరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శమని, అవి సాధిస్తున్న విజయాలు మనందరికీ గర్వ కారణమని కొనియాడారు. అనంతరం కబడ్డీ, వాలీబాల్ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు, బోగారం సర్పంచ్ కవిత రెడ్డి, ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సత్యం, నాయకులు చీర వినోద్, పవన్, మహేందర్, వంగేటి పర్వత్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.