Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విస్తరణకు నోచుకోని రహదారి
- భారీ వర్షానికి రాకపోకలకు అతలాకుతలం
నవతెలంగాణ-సంతోష్‌నగర్
ప్రజా ప్రతినిధుల నాయకుల నిర్లక్ష్యం.. యంత్రాం గం పట్టింపులేకపోవడంతో నిత్యం రద్దీగా ఉంటే రహదారిలో తరచూ డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. ఫలితంగా రహదారి మొత్తం గుంతలమయంగా మారింది. వాస్తవానికి ఇక్కడ రహదారి విస్తరణ చేపట్టాల్సి ఉన్నా పట్టించుకునేవారే ఉండటం లేదని స్థానికులు వాపోతున్నారు.
న్యూ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద పైపులు కలిపేసి సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ ఆలయం కాలనీ వద్ద శ్రీశైలం, కల్వకుర్తి, అచ్చంపేట, షాద్‌నగర్, చాంద్రాయణగుట్ట, బాలాపూర్, నాదర్గుల్, ఆమనగల్, బాబా నగర్ ఓవైసీ చౌరస్తా ప్రాంతాలకు రాకపోకలు సాగించే వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. నియోజకవర్గంలో సంతోష్‌నగర్ డివిజన్ పరిధిలోని ఎక్కడలేని ఇబ్బందులు సంతోష్‌నగర్ న్యూ పోలీస్ స్టేషన్ వద్ద రహదారి విస్తరించాల్సి ఉన్నా ఏళ్లతరబడి మోక్షం కలగడం లేదు. ఈ ప్రాంతంలో కొన్ని నెలలు నుంచి డ్రైనేజీ మురుగు పోటెత్తడంతో రోడ్డు దెబ్బతిని గోతుల మయంగా మారింది. ఉదయం, సాయంత్ర రద్దీ వేళల్లో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.
భవన నిర్మాణ సంస్థలు భారీ నిర్మాణాలు
మ్యాన్ హోల్లోకి పంపింగ్ ప్రాంతంలో ఇరుకు దారి
రెండున్న దశబ్దాల క్రితం వేసిన డ్రయినేజీ పైపులైనులో కొత్తగా నిర్మించిన భవనాలకు చెందిన డ్రయినేజీ లైన్ కలపటంతో పాటు నిర్మాణంలో ఉన్న సెల్లార్లలో చేరిన వర్షం నీటిని మురుగు పారే మ్యాన్హోలలోకిి నేరుగా పంపింగ్ చేస్తున్నారు. దీంతో సమస్య తీవ్రమవుతోంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని డ్రైనేజీ సమస్య పరిష్కరించడంతో పాటు రోడ్డు విస్తరణ చేపట్టాలని కోరుతున్నారు.