Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
అభివృద్ధిలో సమన్యాయం పాటించాలని కార్పొరేటర్లు నిరసన వ్యక్తంచేశారు. గురువారం జవహర్నగర్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మేకల కావ్య అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ కార్పొరేషన్లోని అన్ని డివిజన్లకు నిధులు సమతుల్యం పాటించాలని సూచించారు. నిధులు సక్రమంగా మంజూరు చేయాలని, పక్షపాత దోరణిని విడనాడలని సొంత పార్టీ కార్పొరేటర్లే ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ కావ్య తన డివిజన్లో అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తూ ఇతర డివిజన్లకు మెండిచేయి చూపడం సరికాదని వాపోయారు. ఏకపక్ష ధోరణి అవలంభించడంతో జవహర్ నగర్ అభివృద్ధి కుంటపడుతుందని పలువురు కార్పొరేటర్లు కౌన్సిల్ నమాచేశాని బహిష్కరించి నిరసన తెలిపారు. టీఆర్ఎస్కి వ్యతిరేకం కాదని, అభివృద్ధి జరగడం లేదనే ఆవేదన చెందుతున్నామన్నారు. కార్పొరేషన్లో కార్పొరేటర్లకు గౌరవం లేదని, అధికారులు కొంత మంది చేతిలో కీలుబొమ్మలుగా మారారని తమ సొంత పనులకు సిబ్బందిని వాడుకొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.