Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్
నవతెలంగాణ-ఓయూ
విద్యార్థిని కులం పేరుతో దూషించిన ఎన్ఐటీ వరంగల్ రిజిస్ట్రార్ గోవర్ధన్రావుపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ డిమాండ్ చేశారు. గురువారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమాశంలో శరత్నాయక్ మాట్లాడారు. 'బానోతు శ్రీను అనే లంబాడా విద్యార్థి ఎన్ఐటీ వరంగల్లో పీహెచ్డీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గతేడాది విడుదల చేసిన సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పరీక్షల్లో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగం రాలేదు. దీంతో ఆయన రిజిస్ట్రార్ గోవర్ధన్ రావు పలుమార్లు కలిశారు. రిజిస్ట్రార్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడమే కాకుండా న్యాయం కోసం వెళితే కులం పేరుతో దూషించి అవమానించారు. భారతదేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఎన్ఐటీ వరంగల్లో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. లంబాడా విద్యార్థిని కులంపేరుతో దూషించిన రిజిస్ట్రార్ గోవర్ధన్రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి' అని శరత్ డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. రాజారాం నాయక్, ఓయూ అధ్యక్షులు హనుమంతు నాయక్, కల్యాణ్ నాయక్, సతీష్ నాయక్, రాజశేఖర్ నాయక్, మహేష్ నాయక్, కృష్ణ నాయక్ పాల్గొన్నారు.