Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంగల్ రావు
నవతెలంగాణ-కూకట్పల్లి
కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆపార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంగల్ రావు అన్నారు. శుక్రవారం కూకట్పల్లిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు అని, కాంగ్రెస్ గెలుపుతోనే మునుగోడు అభివద్ధి సాధ్యమవుతుందన్నారు. అసలు మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందే వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు సొంతం చేసుకుని, తమ అక్రమార్జన పెంచుకోవడానికని ప్రజలకు అర్థమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరుతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ను ఆదరించి మునుగోడులో విజయమందిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ప్రజల ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందని, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు నియంత్రణలో లేక ప్రజలు అల్లాడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎమ్మెల్యేలను, ఓటర్లను కొనుగోలు చేస్తూ డబ్బును విచ్చలవిడిగా వెదజల్లుతున్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలుపు మాత్రం కాంగ్రెస్ పార్టీనే వరిస్తుందని చెప్పారు. కూకట్పల్లి నియోజకవర్గంలో భారత్ జోడో యాత్ర నవంబర్ 2వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.