Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
కొడవటిగంటి కుటుంబ రావు రచనలు సమతా వాదనలు, హేతుబద్ధ దృక్పథంతో ఉంటాయని మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహరెడ్డి అన్నారు. ఎందరో మహానుభావులు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీత్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై విఖ్యాత విమర్శకుడు, సాహితీ వేత్త కొడవటిగంటి కుటుంబరావు జయంతి సమావేశం జరిగింది. డాక్టర్ నరసింహరెడ్డి పాల్గొని మాట్లాడుతూ కోకుగా ప్రసిద్ధి పొందిన కుటుంబరావు రచనా శైలి విలక్షణమని సులభభాషలో లోతైన భావాలను అందిస్తారని, ఇందుకు చదువు కథ ఉదాహరణ అని చెప్పారు. చందమామ పిల్లల కథల పత్రికలో పని చేసిన కాలంలోనూ పిల్లలకు హేతువాద తార్కిక ధోరణిలోనే కథలు అందించే వారని గుర్తు చేశారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి అధ్యక్షత వహించిన సభో ఎస్.బి.రాం, రామ్ సుబ్రహ్మణ్యం, పొత్తూరి సుబ్బారావు పాల్గొన్నారు.