Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలల సైన్స్ కాంగ్రెస్కు విద్యార్థులను సిద్ధం చేయాలి: డీఈఓ రోహిణి
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యార్థులు తమ విజ్ఞానాన్ని ప్రదర్శించేందుకు చక్కని వేదికగా జవహర్లాల్ నెహ్రూ జాతీయ వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శన నిలవనుంది. జిల్లా స్థాయిలో విద్యార్ధులు పోటీ పడేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఆర్. రోహిణి వెల్లడించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ఆదేశాల మేరకు నవంబర్ నెలాఖరులో నిర్వహించే జిల్లా స్థాయి జవహర్లాల్ నెహ్రూ వైజ్ఞానిక గణిత పర్యావరణ ప్రదర్శనకు జిల్లాలోని విద్యార్థులు సిద్ధం కావాలన్నారు. ఎస్సీఈఆర్టీ హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఎగ్జిబిషన్లో జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు చక్కని వేదిక అని తెలిపారు .
ప్రధాన అంశం: సాంకేతికత, ఆట వస్తువులు
ఉప అంశాలు
(1) సమాచార ప్రచార సాంకేతికలో పురోగతి
(2)పర్యావరణ అనుకూలంగా పదార్థాలు
(3) ఆరోగ్యం, పరిశుభ్రత
(4) రవాణా, ఆవిష్కరణ
(5) మానవ తప్పిదాల వల్ల పర్యావరణంపై కలిగే అనర్థాలు-నివారణ
(6) ప్రస్తుత ఆవిష్కరణలతో చారిత్రక అభివద్ధి
(7) మన కోసం గణితం
పై ఏడు ఉప అంశాల్లో పెద్దఎత్తున ఎగ్జిబిట్లను ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఎగ్జిబిట్స్ నమూనాలా రూపకల్పనలో గైడ్ టీచర్ విద్యార్థులకు పూర్తి స్థాయిలో సహకరించి సకాలంలో పూర్తి పూర్తయ్యేలా చూడాలని డీఈఓ సూచించారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయులు ప్రస్తుతం శిక్షణలో ఉన్న ఛాత్రోపాధ్యాయులు సైతం బోధనా ఉపకరణాల ప్రదర్శనలో పాల్గొన్నవచ్చని తెలిపారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి ధర్మేందర్ రావును 7799171277 సంప్రదించాలని సూచించారు.