Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఉప్పల్ సర్కిల్ కార్యదర్శి జె వెంకన్న ొపోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-ఉప్పల్
ప్రయివేటు సెక్యూరిటీ గార్డ్స్, అపార్ట్మెంట్ వాచ్మెన్ సమస్యల పరిష్కారానికి ఈనెల 31న చేపట్టనున్న లేబర్ ఆఫీస్ (అంజయ్య భవన్) ముట్టడిని జయప్రదం చేయాలని సీఐటీయూ ఉప్పల్ సర్కిల్ కార్యదర్శి జె వెంకన్న పిలుపునిచ్చారు. శుక్రవారం ఉప్పల్లో చలో లేబర్ ఆఫీస్ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ప్రయివేటు సెక్యూరిటీ గార్డ్స్, అపార్ట్మెంట్ వాచ్మెన్ సమస్యలను పరిష్కరించడంలో పాలకులు నిత్యం విఫలం అవుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జోసెఫ్, మేడ్చల్ జిల్లా రజక సంఘం జిల్లా కార్యదర్శి జె ఉపేందర్, వాచ్మెన్లు యాకయ్య, శంకరయ్య, సంపత్, భాస్కర్, ప్రవీణ్, సురేష్, రాజు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.