Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు
- కౌన్సిల్ సమావేశంలో మేయర్ జక్కా వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
పీర్జాదిగూడ కార్పొరేషన్‌ను మోడల్ సిటీిగా మార్చేందుకు అన్ని విధాలుగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 16 అంశాలతో కూడిన తీర్మానాలను, అలాగే సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపామని అన్నారు. ఈ సందర్భంగా మేయర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ పీర్జాదిగూడ నగరాన్ని మోడల్ సిటీగా మార్చాలనే లక్ష్యంతో ప్రజలకు పారదర్శక పాలన, మెరుగైన మౌళిక సదుపాయలు కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, సంబంధిత అధికారులు తమకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేసి అభివద్ధి కోసం అందరూ కలిసికట్టుగా కషి చేయాలని దిశానిర్థేశం చేయడం జరిగింది. నగర పరిధిలో ప్రజలకు అవసరమైన తాగునీరు, సీసీి రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ ఇతర సమస్యలు లేకుండా చూడాలని సూచించడం జరిగింది. రోడ్లు, డ్రైనేజీ మొదలైన మరమ్మత్తు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టవలసిందిగా అధికారులను అదేశించారు. సీసీి రోడ్లు, భూగర్భ డ్రైనేజీ మొదలైన అభివద్ధి పనులను చేపట్టేందుకు 14 డివిజన్లకు ప్రతి డివిజన్‌కు రూ.20లక్షలు చొప్పున నిధులు కేటాయించి అభివద్ధి చేసేందుకు పాలకమండలి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని తెలిపారు. ''స్వచ్ఛ పీర్జాదిగూడ'' లక్ష్యంగా తడి, పొడి, హానికారక చెత్తను సోర్స్ సెగ్రీగేషన్ పద్ధతిలో వేరుచేసే ప్రక్రియను ఇప్పటికే అవలంబిస్తున్న ఇండోర్, కోయంబత్తూరు వంటి నగరాలను సందర్శించి ఇక్కడ అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని, మరింత సమర్ధవంతంగా దీనిని నిర్వహించేందుకు కార్పొరేటర్లను, కోఆప్షన్ సభ్యులు, అధికారులను త్వరలోనే బెంగుళూరు నగరానికి ''స్టడీ టూర్'' నిర్వహిస్తామని తెలిపారు. ''ఇండియన్ స్వచ్ఛత లీగ్'' కార్యక్రమంలో జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారం అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు ఇదే స్ఫూర్తిని ఇకముందు కూడా కొనసాగిస్తూ, మరింత మెరుగైన ఫలితాలు రాబాట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ఐటి మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రూ.2.00కోట్ల రూపాయలు ప్రకటించడం పట్ల వారికి అలాగే ఇందుకు సహకరించిన కార్మిక Ê ఉపాధి కల్పనా శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి పాలకమండలి తరపున కతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ డా.పి.రామకష్ణ రావు, తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి, డీఈ శ్రీనివాస్, మేనేజర్ జ్యోతిరెడ్డి, ఏఈ వినీల్‌కుమార్, ఏఈ బిక్షపతి, శానిటరీ ఇన్స్పెక్టర్ జానకి,హెచ్ఎండబ్యూఎస్ అధికారులు, విద్యుత్ అధికారులు, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మేయర్ వ్యవహరంపై డిప్యూటీ మేయర్ సీరియస్
అజెండాలో లేని అంశాలు ఎలా ఆమోదిస్తారు?
డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్‌గౌడ్
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొ రేషన్‌లో జరుగుతున్న ఏకపక్ష నిర్ణయాలపై డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారంనాడు ఏర్పాటు చేసిన సాధారణ సర్వసభ్య సమావేశంలో మేయర్ జక్క వెంకట్‌రెడ్డి ఒంటెద్దు పోకడలను దయ్య బట్టారు. వర్గ రాజకీయాలకు మేయర్ తెరలేపడం శోచనీయమన్నారు. సాధారణంగా సమావేశానికి ముందు ఇచ్చిన అజెండాలో పొందుపరచని అంశాలను సమావేశంలో తనకి సంబంధించిన కార్పొరేటర్లకు అభివద్ధి పేరుతో రూ.20లక్షలు 14మందికి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, మంత్రి మల్లారెడ్డికి ఫిిర్యాదు చేస్తామన్నారు.