Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్, మెస్ ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సోమవారం ఓయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కో విద్యార్థికి మెస్ ఫీజులు రూ. 18 వేల నుంచి రూ.20వేల వరకు చెల్లించి కొత్తగా హాస్టల్లో రెన్యువల్ చేసుకోవాలని అధికారులు సూచించారని, దీనిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రూ.1000 రెన్యువల్ ఫీజ్ తీసుకొని మెస్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల విద్యార్థులకు హాస్టల్ ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. లేకపోతే ఓయూ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు.