Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ కిషన్ రావు
- నాటక రచన శిక్షణ విజయవంతం
నవతెలంగాణ-కల్చరల్
నాటక రచనలో శిక్షణ పొందిన యువత నిరంతర అభ్యాసంతో మంచి నాటకాల రచన చేసి రాణించాలని తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య టి. కిషన్ రావు కోరారు. మంచి నాటకాలు అందిస్తే విశ్వవిద్యాలయంలోని రంగస్థల విద్యార్థులుచే ప్రదర్శింపచేస్తామని ఆయన తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రముఖ నాటక సంస్థ రసరంజని నిర్వహణలో జరిగిన 'నాటకం రాయటం ఎలా' అంశంపై జరిగిన ఐదు రోజుల శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈసందర్భంగా సోమవారం విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళా మందిరంలో ముగింపు సభ నిర్వహించారు. ఆచార్య కిషన్ రావు పాల్గొన్న సభకు భాషా సాంస్కతిక శాఖ సంచాలకుడు మామిడి హరి కష్ణ అధ్యక్షత వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాటక రచయితలు సినిమా రచన లక్ష్యంగా కాక ఉత్తమ నాటకాలు సమాజానికి అందించే విధంగా కషి చేయాలన్నారు. రంగస్థల కళా కారులుగా యువత ముందుకు వస్తున్నారని వారికి ప్రతిగాత్మక నాటకాలు అందించాలని సూచించారు. వేదికపై నాటక సినీ రచయిత దివాకర్ బాబు తన నాటక రచన నుంచి సినీ రచన ప్రస్తానం వివరించారు. రంగస్థల శాఖ డీన్ ఆచార్య కోట్ల హాసనుమంతరావు, శిక్షణ శిబిరం నిర్వాహకుడు శ్రీశైల మూర్తి, రంగస్థల ప్రముఖుడు టి. రామచంద్ర రావు పాల్గొన్న సభలో రసరంజని అధ్యక్షుడు డాక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ యువతలో నాటకం పట్ల అభిరుచి పెంచి తెలుగు నాటకాన్ని జాతీయ స్థాయిలో నిలిపేలా కషి జరగాలన్నారు. సంస్థ కార్యదర్శి ముట్నూరు కామేశ్వర రావు నివేదిక సమర్పించారు. మోహన్ సేనపతి, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.