Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-అడిక్మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి, డ్రయినేజీ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం అడిక్మెట్ డివిజన్లో పర్యటించి తాగునీరు, డ్రయినేజీ సమస్యలపై బస్తీవాసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతిబస్తీలో స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకుసాగుతున్నామని చెప్పారు. అందుకు అత్యధిక నిధులు కేటాయిస్తామని తెలిపారు. మురుగునీరు రోడ్లపై నిలవకుండా ఎప్పటికప్పుడు నాలా పూడికతీత పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జయసింహ, జలమండలి అధికారి జీఎం శ్రీధర్ రెడ్డి, జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, ఏఈ విశ్వేశ్, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సురేందర్, నేత శీను, మాధవ్, రవి యాదవ్, మల్లికార్జున్రెడ్డి, బొట్టు శీను, సుబ్బారావు, ఆకారం శ్రీనివాస్, శ్రీకాంత్, అబ్బు పాల్గొన్నారు.