Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
రోడ్డు పనులను పరిశీలించిన ఇంజి నీరింగ్ అధికారులు. డిఈఈ సాజిత్. రోడ్డు నిర్మాణ పనులను కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని పబ్లిక్ హెల్త్ డిప్యూటీ ఇంజనీయర్ సాజిత్ అన్నారు. మంగళ వారం మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపల్లో టీ.ఎఫ్.ఐ.డీ.సీ. ప్రత్యేక నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం కషి చేస్తుందని తెలిపారు.రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులు రూ.5 కోట్ల నిధులను మంజూరు చేయించారని, అందులో భాగంగా జల్పల్లి గేటు నుండి అంబేడ్కర్ చౌరస్తా, ముత్యాలమ్మ దేవాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు, ముత్యాలమ్మ దేవాలయం నుండి శ్రీరాం కాలనీ వరకు, హైదరాబాద్- శ్రీశైలం ప్రధాన రహదారి వాది ఈ హుడా కమాన్ నుండి కాలనీ వరకు ముమ్మరంగా సాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను సంబంధిత కాంట్రాకటర్ నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావా లన్నారు. ఆయన వెంట మున్సిపల్ ఏ.ఈ.లు అయేష, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.