Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక
నవతెలంగాణ-హయత్‌నగర్
దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం హయత్‌నగర్ మండల కేంద్రంలో పత్రికా రంగాన్ని గౌరవించకుండా జర్నలిస్టులను అవమానపరుస్తూ మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ యాజమాన్యం జితేందర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి దళిత బహుజన సంఘాల నాయకులు మాట్లాడుతూ హయత్‌నగర్‌లో గల మ్యాక్స్‌క్యూర్ ఆసుపత్రి యాజమాన్యం హాస్పిటల్లో చేరి చనిపోయిన వారికి ట్రీట్మెంట్ పేరు మీద లక్షల రూపాయల దోపిడీ గుట్టు, బయటికి లాగి మరో ఠాగూర్ సినిమా టైటిల్ పెట్టిన దిశ పేపర్ రిపోర్టర్ నాగరాజును, తోటి రిపోర్టర్స్‌ను యజమాని జితేందర్ రెడ్డి బండ బూతులు తిడుతూ నీ అంతు చూస్తానని బెదిరించిన జితేందర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేశారు. మరొక దళిత రిపోర్టర్ రాజ్‌కుమార్‌ను బెదిరించి మీ జర్నలిస్టులంతా బిచ్చగాళ్ళని కించపరిచిన జితేందర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పారందస్వామి రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ అంబేద్కర్ సంఘం కేవీపీిఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కనకయ్య, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని సుధాకర్, కేవీపీిఎస్ జిల్లా నాయకులు నరసింహ, వడ్డెర సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పందిగోటి ఎల్లయ్య, అంబేద్కర్ సంఘం నాయకులు డప్పు నాగేష్, సఫాయి కర్మచారి హయత్‌నగర్ మండల అధ్యక్షుడు శక్తిసింగారు, సగారి మోచి సంఘం అధ్యక్షులు బెదరకోటి విజయ్, ఎమ్మార్పీఎస్ నాయకులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.