Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో వున్న రిజిస్ట్రేషన్, యూఎల్సీ సమస్యల పరి ష్కారం కోసం జీ.ఓ.వివరాలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం లో ఈనెల 2న జరిగే బహిరంగ సభలో తీపి కబురును ప్రకటన చేయుచున్నారని ఎల్బీనగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
దానిలో భాగంగా మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని యూ.ఎల్.సీ, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న కాలనీవాసులచే ఆయన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా బాలాజీనగర్, శ్రీ రామహిల్స్ కాలనీ, వివేకానందనగర్ కాలనీ, రాగల ఎన్క్లేవ్, పద్మావతి కాలనీ, కమలానగర్, సీ.ఆర్. ఎన్క్లేవ్, బ్యాంక్ కాలనీల యూ.ఎల్.సీ సమస్యలు, కాస్మోపొలిటిన్ కాలనీ సొసైటీ స్థలం కోసం, హిమపురి కాలనీ రెసిడెన్షియల్ జోన్ కోసం ప్రతిపాదనలు ఇచ్చారని గుర్తుచేశారు. కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల తర్వాత సమస్యలు పరిష్కారం కావడం పట్ల ఆనందంగా ఉందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, డివిజన్ మాజీ అధ్యక్షులు టంగుటూరి. నాగరాజు, జగదీష్ యాదవ్, విజయ్ భాస్కర్‌రెడ్డి, పలు కాలనీల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.