Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
డాక్టర్ ఏఎస్రావు నగర్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో ఏఎస్ రావుకి ఘన నివాళులు అర్పించారు. ఎం.రామమూర్తి సభకు ఆహ్వానం పలుకగా, ఎల్.రాజేశ్వరరావు, జి.శివరామకృష్ణ అధ్యక్షత వహించారు. అతిథులుగా కొత్త రామారావు, పి.బి.చారి, గొడుగు యాదగిరిరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన వారిలో అగ్రగణ్యులు డాక్టర్ ఏఎస్ రావు అని కొనియాడారు. అణుశక్తి అంతరిక్షం ఎలక్ట్రానిక్ రంగాల్లో దేశ స్వావలం సాధించడానికి అంకిత భావంతో, దేశభక్తితో కషిచేసిన మహనీయుడు డాక్టర్ ఏఎస్ రావు అని కొనియాడారు. దేశం ఎలక్ట్రానిక్స్ మరియు అంతరిక్షంలో సాధించిన అద్భుత విద్య విజయాలకు ఆయన కారణమని కొనియాడి, ఆయనను తాను విద్యార్థి దశలో జస్టిస్ ఆవుల సాంబశివతో డాక్టర్ ఏఎస్ రావుని కలవడం జరిగిందని, ఆ సందర్భంగా ఆయన్ని చూడడం జరిగిందని గుర్తుచేసుకున్నారు. ఏఎస్ రావు జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను సభికులకు వివరిస్తుండగా ఆసక్తిగా అందరూ వినడం జరిగినది కొన్ని సందర్భాల్లో కంటతడి పెట్టించే విధంగా కొనసాగిన ఆయన ప్రసంగాన్ని సభ్యులు అందరూ ఆసక్తిగా విన్నారు.
పాశం యాదగిరి, ఏపీ చారిని అభినందిస్తూ ఎస్ రావు జీవిత చరిత్రను సినిమాగా తీస్తే భవిష్యత్ తరాలకి మనం మంచి స్ఫూర్తిదాయకమై నటువంటి వ్యక్తిని పరిచయం చేసినట్లుగా ఉంటుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఎస్ రావు నగర్ సొసైటీ డైరెక్టర్ పూర్తి గ్రూప్ బాధ్యులు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైనారు.