Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
సీఐటీయూ కుత్బుల్లాపూర్ మండల కన్వీనర్‌గా కీలుకానీ లక్ష్మణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేడ్చల్ జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు జి.అశోక్ అధ్యక్షతన, షాపూర్ నగర్‌లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ మండల మహాసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ కుత్బుల్లాపూర్ మండలి కమిటీలను ఎంపిక చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం పథకం, కార్మికుల అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి ఆటో, హమాలీ, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాడాలన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఆసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించనున్న సీఐటీయూ మేడ్చల్ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని కోరారు. నూతన కమిటీ సహాయ కన్వీనర్‌గా కే.బీరప్ప, సభ్యులుగా ఆర్ స్వాతి, కె. జమున, కె. కృష్ణ , పి ఏసు, ఈ దేవదానం, ఎస్.కె ఖలీల్, బాబురావు, ఆర్. లక్ష్మి, ఝాన్సీ ఎన్నికయ్యారు.