Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ నగర నాయకులు జి .విఠల్
- లంగర్‌హౌస్‌లో ఆటో డ్రైవర్లతో మీటింగ్
నవతెలంగాణ-ధూల్‌పేట్
ఆటో కార్మికులపై ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలని సీఐటీయూ నగర నాయకులు జి .విఠల్ డిమాండ్ చేశారు. మంగళవారం లంగర్‌హౌస్ డివిజన్లో ఆటో డ్రైవర్ల మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ రోజు ఆటో నడుపుకొని బ్రతికే కార్మికులపైన పోలీస్ అధికారులు చలాన్ పేరుతో ఆటో కార్మికుల్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికీ 10 ఆటోలు సీజ్ చేసి ఒక్క ఆటోకు పదివేల రూపాయలు ఫైన్ వేస్తున్నారన్నారు. ఆటో కార్మికులతో మాట్లాడకుండా ఏ విధంగా ఆటోను సీల్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది డ్రైవర్లకు సొంత ఆటోలు, కొందరు కిరాయి ఆటోలు ఫైనాన్స్ మీద తెచ్చుకుని కడుపుతో జీవనం కొనసాగిస్తున్నారు అన్నారు. ఫైనాన్స్ కట్టకపోతే ఆటోలను తీసుకెళ్తారని అన్నారు. ఇలాంటి వారిపై ఈ విధంగా జరిమానాలు వేస్తుంటే కార్మికులు ఎలా బతకాలన్నారు. ఇన్ని ఇబ్బందుల్లో జీవనం కొనసాగిస్తున్న ఆటో కార్మికులపైన వేధింపులు ఆపాలని, ఆటో కార్మిక సమస్యలను పరిష్కరించాలని అధికారులు కోరారు. లేకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటో డైవర్స్ నాగేష్, గోవిందు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.