Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
నవతెలంగాణ-సరూర్‌నగర్
క్యాన్సర్ రోగులకు అత్యుత్తమ వైద్యాన్ని తక్కువ ధరలకు అందించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. గురువారం ఆర్కే పురంలోని ఓమ్ని హాస్పిటల్లో ఆంకో క్యాన్సర్ సెంటర్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంకొ క్యాన్సర్ సెంటర్ల మంచి సేవలతో గుర్తింపు పొందాయి అన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని తక్కువ ధరలకే అందించేందుకు నిర్వాహకులు కృషి చేయాలి అన్నారు. అంకొ క్యాన్సర్ సెంటర్ చీఫ్ ఆంకాలజిస్ట్, కో ఫౌండర్, సీఎంఓ డాక్టర్ అమిత్ జ్యోత్వాని మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్స అత్యంత క్లిష్టమైనదని తెలిపారు. నాణ్యమైన క్యాన్సర్ చికిత్స వైద్యాన్ని ఎల్బీనగర్ ప్రజలు కోరుకుంటున్నందున అందుబాటు ధరల్లో చికిత్సను అందించేందుకు కృషి చేస్తామన్నారు. హైదరాబాదులో 4 ఆంకో క్యాన్సర్ సెంటర్ లు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓమ్ని హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ గౌతమ్ రెడ్డి, క్యాన్సర్ నిపుణుల బృందం డాక్టర్ సునీల్ కౌశిక్, డాక్టర్ ఎంఎ. సబూర్, డాక్టర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.