Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొన్ని రోజులుగా పనిచేయని లిఫ్టులు
- ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులు
- పైకి నీళ్లు తీసుకెళ్లాలంటే సమస్యలు
నవతెలంగాణ-వనస్థలిపురం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదవాళ్ల గొప్పింటి కలతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించే నివాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వనస్థలిపురం రైతు బజార్ వద్ద ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఎ, బి, సి బ్లాక్ లుగా విభజించి నిర్మాణాలు చేపట్టారు. ప్రతి బ్లాక్లోను రెండు లిఫ్టులు ఏర్పాటు చేసి ఇళ్లల్లో నివసించే నివాసులకు అందుబాటులోకి తెచ్చారు. కానీ కొన్ని రోజులుగా ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క లిఫ్టు పనిచేయకపోవడంతో డబుల్ బెడ్ రూమ్లో నివసించే నివాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- గత కొన్ని రోజులుగా లిఫ్టులు పనిచేయట్లేదు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోని లిఫ్టులు పనిచేయకపోవడంతో ముఖ్యంగా వృద్ధులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కోసం కిందకు వచ్చి నీరు పైకి తీసుకువెళ్లాలంటే ఎన్నో బాధలుపడుతూ ఆయా ఇళ్లల్లో నివసించే నివాసులు ఇబ్బందులతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. లిఫ్టు పనిచేసే విధంగా ప్రజా ప్రతినిధులు తోపాటు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఇళ్లల్లో నివసిస్తున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
- అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోండి
వనస్థలిపురం రైతు బజార్ సమీపంలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో లిఫ్టులు పనిచేయక పలు ఇబ్బందులు కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న పట్టించుకునే నాధుడు లేడని, ఆ ఇళ్లల్లో నివసిస్తున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, పనిచేయని లిఫ్ట్లు మళ్లీ ఎప్పుడు పని చేస్తాయో తెలియక అయోమయ స్థితిలో ఆ ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు ఉన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతి నిధులు పట్టించుకుని లిఫ్టుల సమస్యను పరిష్కరిం చాలని ఆవేదనతో కోరారు.