Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ-సరూర్‌నగర్
మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడి పనిచేశారని రాబోయే రోజుల్లో కూడా అంతే కష్టపడి పనిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఎస్కే మహమ్మద్‌కు సూచించారు. టీిఆర్‌ఎస్ పార్టీ భారీ విజయం సాధించడం సందర్భంగా గురువారం మహమ్మద్ ఆర్కే పురం నాయకులతో కలిసి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మరిగూడెం మండలంలో ఎంతో కష్టపడి పని చేశారని అన్నారు. నియోజకవర్గంలో, డివిజన్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏ ఎన్నికలైనా టీిఆర్‌ఎస్ పార్టీదే విజయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మారోజు రామాచారి, తాటికొండ రాఘవేంద్ర గుప్తా, అబ్దుల్ కరీం, సోమేశ్వరరావు తదితరులున్నారు.