Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ ప్రవీణ్ చంద్ర
నవతెలంగాణ-ఓయూ
డిజిటల్ ఇండియా ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని మద్రాస్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రవీణ్ చంద్ర అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ఈఈఈ విభాగంలో 'డిజిటల్ ఇండియా-ఉద్యోగ అవకాశాలు' అంశంపై సెమినార్ నిర్వహించారు. ప్రధాన వక్త మద్రాస్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రవీణ్ చంద్ర మాట్లాడుతూ డిజిటల్ ఇండియా ద్వారా అనేక కీలక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. డిజిటల్ లాకర్, ఈ-విద్య, ఈ-వైద్యం, వాణిజ్యం పరిపాలన వంటి తదితర సేవలతో ఆన్లైన్ పేమెంట్స్‌లో దేశం ముందుకు వెళ్తుందన్నారు. ఈ-గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, బ్రాడ్ బ్యాండ్, మొబైల్ కనెక్టవిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్, ఐటీ ఆధారిత రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రధాన లక్ష్యం అని అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ అంశాలపై సెమినార్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈమహాసభలకు త్రిపుర మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కారు హాజరవుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు అంజనేయులు, రవి నాయక్, ఉపాధ్యక్షులు రామాటేంకి శ్రీను, సహాయ కార్యదర్శి సాయి కిరణ్, రాజు ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.