Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడే ఎంచుకున్న రంగాలలో రాణిస్తారని అను ఇంద్ర సంస్థ సైంటిస్ట్ డాక్టర్ డి. ఎస్ శెట్టి సూచించారు. ఆరోరా గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో నూతన విద్యార్థులకు ఇండక్షన్ (అభిజ్ఞ) కార్యక్రమాన్ని శనివారం ఆర్టీసీ కళాభవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాటా ్లడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతీ అంశంపై పరిశోధ నాత్మకంగా విద్యను కొనసాగించాలని సూచించారు. విశిష్ట అతిథిగా హాజరైన టీసీఎస్ హైదరాబాద్ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ సూరంపూడి మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు చేయాలని తెలిపారు. ఇస్రో సైంటిస్ట్ డాక్టర్ చిదానందప్ప ,ఇన్ఫోసిస్ మేనేజర్ మాధవ శర్మ విద్యార్థులకు కావలసిన నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. అరోరా చైర్మెన్ రాజబాబు, ఆరోర గ్రూపు సంస్థల సెక్రటరీ డాక్టర్ రమేష్ బాబు, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్, మహేష్ ప్రభు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.