Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
- హైదరాబాద్‌లో పలు చోట్ల 'మోడీ గో బ్యాక్' అంటూ నిరసనలు
- అడ్డుకున్న పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత,పలువురు అరెస్టు
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
జాతికి అంకితం చేసి జాతి ఆస్తులను కార్పొరేట్లకు అమ్ముకుంటున్న మోడీకి దేశాన్ని పాలించే హక్కు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మానిటైజేషన్ పథకం పేరుతో ప్రధాని మోడీ తన కొంత మంది వ్యాపార స్నేహితుల ప్రయోజనం చేకూర్చడానికి భారతదేశాన్ని ''క్లియరెన్స్ సేల్'' లో పెట్టారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చకుండా రాష్ట్రంలోకి అడుగుపెట్టే నైతిక హక్కు మోడీకి లేదని అన్నారు. విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిరంకుశ మోడీ ప్రజా వ్యతిరేక విధా నాలను వ్యతిరేకిస్తు 'మోడీ గో బ్యాక్' అనే నినాదంతో శని వారం హిమాయత్‌నగర్ సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖూ ్డమ్ భవన్ నుంచి సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వ ర్యంలో సీపీఐ శ్రేణులు నల్ల చొక్కాలు ధరించి, నల్ల జెండాలు చేతబూని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా బయల్దేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, సీపీఐ శ్రేణుల మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. తోపులాటలో సీపీఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఛాయా దేవి కింద పడిపోవడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ, సిపిఐ హైదరా బాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహతో పాటు పలువురు సిపిఐ, ఏఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ..పోలీసులు సీపీఐ రాష్ట్ర కార్యాలయం లోపలికి వచ్చి కార్యకర్తలు వేసుకుంటున్న నల్ల చొక్కాలను లాక్కోవడం,కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేయడం, ర్యాలీ అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర పోలీసులు ప్రధాని మోడీకి పని చేస్తున్నారా లేక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పని చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ అసమర్థత, బాధ్యతారాహిత్యంగా పాలనా కొనసాగిస్తున్నందునే ఆయన రాకను అడ్డుకుంటున్నామని తెలిపారు. సింగరేణి బొగ్గు గనులను ప్రయివేట్ పరం చేసే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను తీవ్రంగా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.సీపీఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి బి.స్టాలిన్, కార్యవర్గ సభ్యులు షంషుద్దీన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర, నగర అధ్యక్షులు బాలకష్ణ, ప్రధాన కార్యదర్శి నెర్లకంటి శ్రీకాంత్, సిపిఐ నాయకులు శక్రి భాయి, అమీనా, సురేందర్ సింగ్, నదీమ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
ధూల్‌పేట్ : మోడీ పర్యటన నేపథ్యంలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర కమిటీల నిరసన పిలుపు మేరకు సీఐటీయు గ్రేటర్ హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో సంతోష్ నగర్ ఎక్స్ రోడ్స్ వద్ద కార్మిక సంఘాలు నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతో మోడీ గో బ్యాక్, సేవ్ పబ్లిక్ సెక్టార్స్, సేవ్ ఇండియా అంటూ నినాదాలిస్తూ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ సీఐటీయు సౌత్ జిల్లా కార్యదర్శి ఎం.శ్రావణ కుమార్ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మజూస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలోని సింగరేణి, విద్యుత్, ఎన్ టిపిసి తదితర రంగాల్లో ప్రయివేటీకరణ చర్యలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులను పోలీసులు అరెస్టు చేసి సైదాబాద్ పిఎస్ కు తరలించారు. తిరిగి స్వంత పూచీకత్తుపై విడుదలయ్యారు. జిల్లా అధ్యక్షురాలు ఎం.మీనా, నాయకులు పి. నాగేశ్వర్, ఎల్. కోటిరెడ్డి, అలిఖల్బాస్ మాట్లాడుతూ.. నరేంద్రమోడీ విధానాలన్నీ దేశాన్ని విభజించి పాలించు అన్నచందంగా ఉన్నాయని విమర్శించారు. నాయకులు జంగయ్య, కిషన్, రాములు, అబ్దుల్ లతీఫ్, లక్ష్మమ్మ, శశికల, మహేష్ దుర్గాలతోపాటు 55 మంది పాల్గొన్నారు.
ముషీరాబాద్ : టీఆర్ఎస్ కేవీ, సిఐటియు, ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుతంగా చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మిక సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ ఆవరణలో నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి భూపాల్ నగర అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్ కుమారస్వామి, టిఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి నారాయణ, ఉపా ధ్యక్షులు మారయ్య లతో కలిసి టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు జి రాంబాబు యాదవ్ మాట్లాడుతూ మోడీకి తెలంగాణలో అడుగుపెట్టే అర్హత లేద న్నారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌ కగా బడా పెట్టుబడిదారులకు అమ్మడం ఏంటని ప్రశ్నించారు.
కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేసిన విష యాన్ని తెలుసుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కార్మిక సంఘాల నేతలకు సంఘీభావం ప్రకటించారు.