Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
విదేశాల్లో ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యావకాశాలు, చేయాల్సిన స్కోర్ల గురించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని హయత్ ప్లేస్‌లో మాన్య ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో స్టడీ ఎబ్రాడ్ ఎక్స్పో పేరుతో ఉచిత అవగాహనా సదస్సును నిర్వహించారు. కెనెడా, ఆస్ట్రేలియా, యూకే, అమెరికా, యూరప్ లోని ఆయా యూనివర్సిటీల విద్యాప్రమాణాలను, సులువైన మార్గదర్శకాలను వివరించారు. సుమారు 600 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరై యూనివర్సిటీల వివరాలు, వారి సందేహాలను నివత్తి చేసుకు న్నారు. విద్యార్థులకు ఈ సదస్సు ఎంతో ఉపయుక్తమని మాన్య ఎడ్యుకేషన్ సీఓఓ హిమాన్షుకిషోర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కేచ్ వాసుదేవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శివశంకర్, సిబ్బంది పాల్గొన్నారు.