Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
నేటి యువత ఆసక్తి గల రంగాల్లో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. ఫతేనగర్‌లో జరిగిన తెలంగాణ డిస్ట్రిక్ట్ 2022 ఓపెన్ మెన్ అండ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతలకు ఎమ్మెల్యే కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్‌తో కలసి బహుమతులను అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతను ప్రోత్సహించేందుకు తాము ఎల్లవేళలా సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. యువకులు చదువుతో పాటు తమకు ఆసక్తి గల రంగాన్ని ఎంచుకుని కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ తీసుకుని మెరుగైన ప్రదర్శనలతో రాణిస్తూ జాతీయ స్థాయికి రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు పాల్గొన్నారు.