Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రోడ్లను తెరిపించాలని టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి మాజీ బోర్డు సభ్యులతో కలిసి సోమవారం ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కలిసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తన వంతుగా రోడ్లను తెరిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఇందకు శుభాష్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి తానూ ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం స్తానిక టీఆర్ఎస్ నాయకులు, ప్రజల మద్దతుతో ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుం టూ పోరాడుతున్నామన్నారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డ్ మాజీ సభ్యులు పాండు యాదవ్, శ్యామ్, నళిని కిరణ్, పెద్దల నర్సింహ, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.